విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్య బోధన -పరిశోధన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి రెండు కళ్ళు వంటివని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. బుధవారం విశ్వవిద్యాలయం ప్రగతిపై విశాలాంధ్ర ఇంటర్వ్యూలో వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీ త్వరలోనే చేపడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని అన్నారు . ఎటువంటి అడ్డంకులు లేకుండా నియామక ప్రక్రియ నోటిఫికేషన్ వెలబడుతుందన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగు, శిక్షణ నైపుణ్యాలు , సృజనాత్మక , పారిశ్రామిక రంగంలో వస్తున్న అవకాశాలను చేసుకునేలా సన్నద్ధతను చేస్తున్నామన్నారు. రాయలసీమలో విద్యార్థులకు జేఎన్టీయూలో సిఎస్ఆర్ సహకారంతో క్వాంటం టెక్నాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి విద్యార్థులకు శిక్షణ తరగతులు చేపడతామన్నారు. మినీ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జేఎన్టీయూ అనుబంధం కళాశాల విద్యార్థులకు ఏఐ అద్వానీ గ్రూపు సహకారంతో బీటెక్ విద్యార్థులకు ఉచితంగా శిక్షణను అందిస్తున్నామని అన్నారు. కోర్సు శిక్షణతో విద్యార్థులకు 2 క్రెడిట్ వస్తాయన్నారు. బీటెక్ చేస్తున్న ఏ కోర్సు విద్యార్థి అయిన ఏ ఐ కోర్సును తీసుకుని అవకాశాన్ని కల్పించామన్నారు. యువ ఇంజనీర్లు ఉద్యోగాల సృష్టికర్తలగా.. ఆలోచనలను ఆవిష్కరణలకు వేదికగా నిలిచేలా.. సమాజ అభివృద్ధి కు తోడ్పాటున అందించేలా సరికొత్త సాంకేతిక విప్లవ మార్పులును తీసుకురావాలన్నారు. పోలీస్ నియామకలకు ఎంపికైన పిటిసి లో శిక్షణ పొందుతున్న పోలీసులకు సైబర్ సెక్యూరిటీపై జేఎన్టీయూ విశ్వవిద్యాలయం శిక్షణను అందించేందుకు ఒప్పందం చేసుకోనున్నామని అన్నారు. విద్యార్థులకు సాంకేతికత పట్టు పై ప్రస్తుతం అందిస్తున్న 4జి టెక్నాలజీని నుండి 5 జి నెట్వర్క్ ఉచిత వైఫై ని ఇస్తామన్నారు. పాఠ్యాంశాలలోని లోతుగా అధ్యయనం, పట్టు, సమయం, అమలుపరచడం లక్ష్యాల వైపు విద్యార్థులు ఆలోచనలు మదిలో ఉంటే ఉజ్వల శిఖరాలను అందుకోగలరని పేర్కొన్నారు.


