Homeజిల్లాలుకర్నూలుమృతుని కుటుంబానికి అండగా టీడీపీ

మృతుని కుటుంబానికి అండగా టీడీపీ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ గ్రామ అధ్యక్షులు వెంకన్న, భీమన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో కొలిమి పెద్ద నరసప్ప మనవడు అన్విక్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అన్విక్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాజీ సర్పంచ్ రామన్న తరపున మట్టి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొత్తూరు రంగన్న, ఖాసిం, తాయన్న, చిన్న భీమేష్, లాజరు, కొలిమి రంగన్న, శాంతప్ప, ఏసన్న, కొలిమి తాయన్న, దేవదానం, బజారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు