మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్చే హక్కు ఎవరిచ్చారు నీకు?
మోడీ కి ధోనెపూడి సూటి ప్రశ్న
వాయు కాలుష్యాన్ని నిర్మూలన చేయలేవా మోడీ?
జగ్గయ్యపేట ను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యం… దీనికి పరిష్కారమే లేదా?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చే హక్కు ఎవరు ఇచ్చారు?
కమ్యూనిస్టులంటే మరెవరో కాదు దేశభక్తులు…
జగ్గయ్యపేటలో ఘనంగా సిపిఐ శతజయంతి ఉత్సవాలు….
భారీగా బైక్ ర్యాలీ…
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన దోనేపూడి
జగ్గయ్యపేట: భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు……. మొదటగా పిల్లలమర్రి భవన్ లో పతాకావిష్కరణ చేసి, మాజీ ఎమ్మెల్యే దివంగత కామ్రేడ్.పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కామ్రేడ్. మహమ్మద్ మన్సూర్ కు ఘన నివాళులు అర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు… డిపో సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కమల సెంటర్, ముత్యాల రోడ్డు మీదుగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీని నిర్వహించారు…. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ…… సిపిఐ 100 ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు చేసిందని పేద ప్రజల కోసం వంద సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఏర్పడి 2025 డిసెంబర్ నాటికి వందేళ్లు పూర్తవడంతో శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు….
సిపిఐ ఆవిర్భావం నుంచే రైతాంగ సమస్యలను తన ప్రధాన అజెండాగా తీసుకుంది. భూమిలేని పేద రైతులకు భూమి హక్కులు, కౌలుదారులకు రక్షణ, సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధర కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. రైతులు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో భూసంస్కరణలు, రుణమాఫీ, ప్రభుత్వ మద్దతు ధర కోసం సిపిఐ నిరంతరం పోరాడిందనీ, పోరాడుతుందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం సిపిఐ చేసిన పోరాటాలు ఈ దేశ చరిత్రలో నిలిచిపోయాయి. అశేష పోరాటల ఫలితమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిరుగారుస్తుందని అవేదన వ్యక్తం చేశారు.రోజుకు 8 గంటల పని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు సాధించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది. కార్మికులను మనుషుల్లా చూడని పరిస్థితుల్లో యజమానుల దోపిడీకి ఎదిరించి సిపిఐ ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటాల మార్గంలో సిపిఐ వేలాది మంది నాయకులు, కార్యకర్తలు జైళ్ల పాలయ్యారు, లాఠీచార్జీలు ఎదుర్కొన్నారు, ప్రాణ త్యాగాలు చేశారనీ గుర్తు చేశారు. దేశ స్వాతంత్యం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీగా సిపిఐ నిలిచింది. ఎర్ర జెండా కేవలం ఒక జెండా కాదనీ అది త్యాగానికి, పోరాటానికి, ప్రజల పక్షానికి చిహ్నమనికొనియాడారు. నేటికీ రైతాంగం సంక్షోభంలో ఉంది. కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా సిపిఐ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తోంది, సమస్యలపై పోరాటాలకు పిలుపునిస్తోంది. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసి రైతు – కార్మిక ఐక్యతను బలోపేతం చేద్దాం.దేశంలో పేదలు, కార్మికులు మరియు సామాన్య ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. సిపిఐ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తోందని గుర్తు చేశారు.
ప్రస్తుత పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడంలోనూ కమ్యూనిస్టులే ముందుంటారని అన్నారు. శత జయంతి ఉత్సవాల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుడ్డి రాయప్ప, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజి శివాజి, నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు,మెటీకల శ్రీనివాస రావు,కరిసే మధు,సీపీఐ సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రహ్మం,పోతుపాక వెంకటేశ్వర్లు, భోగ్యం నాగులు, చలపతి రావు, మీరా, ముజీబ్,నీలకంఠం శివ ప్రసాద్,శ్రీనివాస చారి, ఆదాం, మాశెట్టి రమేష్ బాబు, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.


