Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపీఏబీఆర్ కుడి కెనాల్ ద్వారా 49 చెరువులకు నీరు నింపాలి

పీఏబీఆర్ కుడి కెనాల్ ద్వారా 49 చెరువులకు నీరు నింపాలి

- Advertisement -

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:: పీఏబీఆర్ కుడి కెనాల్ ద్వారా 49 చెరువులకు నీటితో నింపాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. అనంతరం వారు పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమర్రి చెరువులకు నీరు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. తదుపరి ఆర్డిఓ మహేష్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిపిఐ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, తాడిమర్రి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ముసుగు మధు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి,తాడిమర్రి మండలం లో పీఏబీఆర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 40 చెరువులకు నీరు నింపుతూ ఉండేవారు అని, అందులో మా బత్తలపల్లి నరిహార కుంట చెరువు ఆ జాబితాలో ఉంది అని, అయితే రెండు సంవత్సరాల నుంచి మా చెరువుకు పీఏబిఆర్ కుడికాలువ ద్వారా వచ్చే నీరు రావడం లేదు అని తెలిపారు. ఈ చెరువుకు నీరు వదలడం ద్వారా బత్తలపల్లి పట్టణంలో ఉన్న దాదాపు వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్య తీరనుంది అని తెలిపారు. ఇదే కాకుండా చెరువు దిగువ భాగంలో ఉన్న బత్తలపల్లి, గంటాపురం, నార్సింపల్లి, గుమ్మలకుంట, అగ్రహారం, జల్ల నారాయణ పల్లి, తాడిమర్రి, పుల్లపల్లి గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ బోరు బావులలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య కూడా లేకుండా పంటలు యధావిధిగా సాగు చేయడానికి వీలు కలుగుతుంది అని తెలిపారు. ప్రస్తుతం బోరు బావులలో భూగర్భ జలాలు నీటిమట్టం తగ్గి సాగునీరు సమస్య కూడ ఏర్పడింది అన్నారు.బత్తలపల్లి, తాడిమర్రి మండల లో చెరువుకు నీరు నింపాలని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు, ఎర్రం శెట్టి రమణ, శ్రీనివాసులు,చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వెంకటస్వామి, వెంకటనారాయణ,యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా,పట్టణ నాయకులు, చెన్నంపల్లి శ్రీనివాసులు,శ్రీధర్, ఆదినారాయణ,వేణుగోపాల్, తాజుద్దీన్, లక్ష్మి నారాయణ, మసూద్,మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు