విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: గణితం ప్రపంచ గమనాన్ని మార్చినది, సాంకేతికత ఆవిష్కరణ, సూపర్ కంప్యూటర్ ను అందించిందని అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ ఎం. అనంత రాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ అనంత రాముడు మాట్లాడుతూ. గణితం మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని వివరించారు. విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలను పరిష్కరించడంలో గణితశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ..శ్రీనివాస రామానుజన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు గత నమూనాలు, చార్ట్ లు, క్విజ్ పోటీలు, గణిత పజిల్స్ లో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు ఛైర్మన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఏఓ నరసింహారావు , ప్రధానోపాధ్యాయురాలు , శాలిని , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


