Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్రైతు మేలు కోరే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం

రైతు మేలు కోరే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం

- Advertisement -

విశాలాంధ్ర: తాళ్లపూడి

ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వమని అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వమని మాజీ ఎంపిటిసి రేకపల్లి ముత్యాలరావు, కొవ్వూరు వైస్ ఏ.ఎం.సి. గా కొవ్వూరు లో ప్రమాణ స్వీకారం చేయనున్న రేకపల్లి మంగామణి లు పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు లో ఎమ్మెల్యే ముప్పిడి అధ్యక్షతన జరిగే అన్నదాత సుఖీభవ, ఏ.ఎం.సి కార్యవర్గ ప్రమాన స్వీకార కార్యక్రమాలకు తాళ్లపూడి మండలం నుండి నాయకులు అభిమాను లు కొవ్వూరు బయలు దేరారు. తాళ్లపూడి నుండి మండల టీడీపీ అధ్యక్షులు నామన పరమేశ్వర రావు, అన్నదేవరపేట నుండి సీనియర్ నాయకులు కోటారు వెంకట్రావు, పెద్దెవం, మలకపల్లి నుండి టీడీపీ నాయకులు మద్దిపాటి ప్రకాశం, ఉప సర్పంచ్ రామారావు, ఎన్డీయే నాయకులు అభిమానులు వెంటారగా రేకపల్లి మంగామని ముత్యాలరావు దంపతులు కొవ్వూరు ట్రాక్టర్ల తో ర్యాలీ గా బయలు దేరారు. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు అంటూ వినాదాలు చేసుకుంటు తరలి వెళ్లారు. పెద్దెవం నుండి కోడి శంకరం తీగిరిపల్లి గోపి, మద్దుకురి ఎర్రబ్బులు, రాపాక శ్యామ్,  రామాంజనేయులు, మైనం గంగరాజు తదితరులు ర్యాలీ లొ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు