Sunday, July 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె డిమాండ్ల పరిష్కారానికి కార్మికశాఖ జోక్యం చేసుకోవాలి..

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె డిమాండ్ల పరిష్కారానికి కార్మికశాఖ జోక్యం చేసుకోవాలి..

అధ్యక్ష కార్యదర్శులు బొగ్గు నాగరాజు, జయకృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో భాగంగా 8.వ రోజు ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయం ముందు. కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తెలిపారు,
ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు
బొగ్గు నాగరాజు, జయకృష్ణ, బాబు, అనిల్, మాట్లాడుతూ
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యానికి తగిన జీతాలు చెల్లించక పోవడంతో గత 7 ఏళ్లుగా ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటగిరీల నిర్ణయం లో 2018 లో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలి అని, కార్మికశాఖ 2012 లో జారీ చేసిన .జిఓ ఎం ఎస్ నెంబర్ 11 ఆధారంగా కేటగిరీల నిర్ణయించి, జీ ఓ ఎం ఎస్. నెం, 36 ప్రకారం జీతాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్య పరిష్కరించడం లేదు అని మండిపడ్డారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం వదిలేసి, న్యాయం కోసం పోరాడుతున్న కార్మికుల పోరాటాలపై ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తమ కుటుంబాలను పస్తులనుండి గట్టెక్కించాలని, తల్లికి వందనం తో పాటు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 4 వ తేదీ తర్వాత నిర్వహించ తలపెట్టిన సమ్మె పోరాటం కి సంబంధించి ఏ పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, జూన్ 7వ తేదీన, జులై ఒకటో తేదీన రెండు విడతలుగా తెలియజేసినప్పటికీ, సంఘాలతో జాయింట్ మీటింగ్ జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం పట్ల వారు విరుచుకుపడ్డారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటం విషయం లో కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను పరిష్కారించి , ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
కాటమయ్య. చింతా కేశవ. దస్తగిరి. చంద్రశేఖర్ రెడ్డి. యోగేష్. తదితర కార్మికులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు