- Advertisement -
విశాలాంధ–తాడిపత్రి: పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం మహిళా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కానిస్టేబుల్ రమేష్ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డికి లయన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు టి. సంజీవరెడ్డి, ట్రెజరర్ లక్ష్మీనారాయణ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, రాజనాయుడు, మహమ్మద్ రఫీ, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


