మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, రిటైర్డ్ కంటి డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వాహన డ్రైవర్లు జాతీయ రహదారి నియమ నిబంధనలు తప్పక పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, రిటైర్డ్ కంటి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గల ఆర్ టి ఓ కార్యాలయంలో జాతీయ భద్రత రహదారి మాసోత్సవాల సందర్భంగా డాక్టర్ నరసింహులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వాహన డ్రైవర్లతో అవగాహన సదస్సును వారు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ఉండాలని, తమ కుటుంబాలను గుర్తుపెట్టుకుని విధులను నిర్వర్తించినప్పుడే ప్రమాదాలు జరగవు అని తెలిపారు. మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలకు విధి (తలరాత) నిర్ణయం కాదు అని వారు స్పష్టం చేశారు. ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో జనవరి నెల అంతా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని డ్రైవర్లు అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు జబ్బులతో వచ్చే మరణాలతో పోటీ పడుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు తెలిపారు. జాతీయ రహదారిలో 50 కిలోమీటర్లకు ఒకచోట ట్రామా మా కేర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ పాటించకపోవడమే ప్రమాదాలకు హేతువ అవుతున్నాయని తెలిపారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి మాట్లాడుతూ మా కార్యాలయంలో జనవరి నెల 31వ తేదీ వరకు డ్రైవర్లకు అవగాహనతో పాటు కంటికి ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. అతివేగంతో వెళ్లే ప్రతి వాహనము ముందు వెళ్లే వాహనమును ఓవర్టేక్ చేయరాదన్నారు. సెల్ఫోన్లో మాట్లాడుట, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయుట, సీటు బెల్టు లేకుండా ప్రయాణం చేయుట, మద్యం సేవించి వాహనమును నడుపుట, నిద్ర మత్తులో వాహనం నడప లాంటివి ప్రమాదాలకు లక్షణాలని తెలిపారు. కావున డ్రైవర్లకు తమ వృత్తి ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యముగా ఆరోగ్యము కుటుంబాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యం పై చక్కటి శ్రద్ధను ఘనపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వాహనదారులు దాదాపు 60 మంది దాకా పాల్గొన్నారు.
జాతీయ రహదారి నియమ నిబంధనలు డ్రైవర్లు తప్పక పాటించాలి..
- Advertisement -
RELATED ARTICLES


