Homeజాతీయంతగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర

తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర

- Advertisement -

తగ్గినట్లే తగ్గి ప‌సిడి ధర మళ్లీ పెరిగింది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ యూటర్న్యూతో తగ్గుముఖం పట్టిన బంగారం ధ‌ర మళ్లీ పెరిగింది. డెన్మార్క్‌ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్‌ ప్రకటించడంతో.. నిన్న బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే, అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఇరాన్‌ చుట్టూ అమెరికా బలగాలు మోహరించడంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. బంగారానికి పెరిగిన డిమాండ్‌ కారణంగా మళ్లీ దీని ధర పెరిగింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర ఔన్సు 5 వేల డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం 4,945 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీన్ని అనుసరించి దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి రూ.1,59,954 పలుకుతోంది. గురువారంతో పోలిస్తే ఒక్క రోజులోనే పసిడి రూ.5వేలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.41 లక్షలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్సు 98 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3.25 లక్షలుగా ఉందని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు