ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు (DCP RADHAKISHANRAO) తో కలిపి కేటీఆర్‌ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్‌రావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, రాధాకిషన్‌రావును కలిపి సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాధాకిషన్‌రావు చెప్పిన అంశాలపై సమాచారముందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.


