Sunday, February 8, 2026
Homeజిల్లాలుఏలూరుమకుటం లేని మహారాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి

మకుటం లేని మహారాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని , మకుటం లేని మహారాజుగా పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బిరుదు గడ్ల ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. గవరవరం గ్రామంలో వైయస్సార్ విగ్రహం వద్ద ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వైయస్సార్ 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు, రైతన్నలకు, విద్యార్థుల కలలకు రూపం ఇచ్చిన మహా నాయకుడు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పదవేల దుర్గారావు, సత్యనారాయణ, దివాకర్, రవిబాబు, గంటా రమేష్, కసుకుర్తి వేణు, శీమకుర్తి సత్యనారాయణ, బొమ్మ శ్రీను, గాబ్రియేల్ , రాయుడు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు