Saturday, November 15, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం

ట్రంప్‌నకు ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం

- Advertisement -

ఇజ్రాయెల్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఒక అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.ఇది గాజా ఒప్పందం కుదిర్చి,బందీల విడుదల కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ తీసుకునే చర్యగా ఉంది.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంగాప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌ని ప్రదానం చేయనుంది.రాబోయే నెలల్లో తగిన సమయం,వేదికను నిర్ణయించి ఈ గౌరవాన్ని ట్రంప్‌కి అందజేయనున్నట్లు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ చెప్పారు.

బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషి
ఇప్పటి పరిస్థితులలో బందీల విడుదలకు దారితీసిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాకారం చేసేందుకు ట్రంప్‌ చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని ఇవ్వడం తగినది అని హెర్జోగ్‌ తెలిపారు.ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ అందించిన అచంచలమైన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం నెలకొల్పిన శాంతి చర్యలను ఈ గౌరవం ద్వారా తాము స్మరించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు