Thursday, December 11, 2025
Homeఆంధ్రప్రదేశ్టీచర్‌ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక

టీచర్‌ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక

- Advertisement -

అభినందించిన వన్‌టౌన్‌ సీఐ

విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, నాగరాజు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు. నాగరాజు ఫిజిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా, దుర్గాప్రసాద్‌ సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వారిని వన్‌టౌన్‌ సీఐ గురుప్రకాష్‌ అభినందించి సన్మానించారు. వారిద్దరూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువాతో సన్మానించి కనకదుర్గమ్మ ప్రసాదాలు అందించారు. పలువురు పోలీసు సిబ్బంది కూడా దుర్గాప్రసాద్, నాగరాజులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు