Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ 2026 డైరీ క్యాలెండర్స్ ఆవిష్కరణ

యుటిఎఫ్ 2026 డైరీ క్యాలెండర్స్ ఆవిష్కరణ

- Advertisement -

యుటిఎఫ్ 2026 డైరీ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీ, వాల్ క్యాలెండర్ , స్టిక్కర్ క్యాలెండర్లు ను స్థానిక ఎమ్మార్సీ భవన్లో జిల్లా విద్యాశాఖ అధికారి బి. కిష్టప్ప ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి పి అమర్ నారాయణరెడ్డి ధర్మవరం మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి, గోపాల్ నాయక్ కొత్తచెరువు మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులతో కలసి సంయుక్తంగా ఆవిష్కరణ గావించారు. జిల్లా విద్యశాఖ అధికారి బికిష్టప్ప మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార విషయాలే కాకుండా, సామజిక దృక్పధంతో సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుందని, అందులో భాగంగా కరోనా సమయంలో ప్రజలకు ఆహార వస్తువులు అందజేయం, వెంటిలేషన్ సౌకర్యాలు కల్పించడం, పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ అందించడం, రక్త దాన శిభిరాలు ఏర్పాటు చేయడం అనేవి అభిందనీయం అని అన్నారు. యుటిఎఫ్
రాష్ట్ర కార్యదర్శి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలల కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐ ఆర్ 29 శాతము ప్రకటించి, వీలైనంత త్వరగా 12 వ పి ఆర్ సిని అమలు చేయాలని, ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా 10 వ తరగతి విద్యార్థులుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికా కార్యక్రమం లో ఆదివారాలు పండుగ రోజులను మినహాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణ నాయక్, జిల్లా జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి , జిల్లా రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి, ధర్మవరం మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి, గోపాల్ నాయక్, సిపిఎస్ సబ్ కమిటీ కన్వీనర్ బిల్లే రామాంజనేయులు జిల్లా అడిట్ కమిటీ సభ్యులు జింక హరికృష్ణ , ధర్మవరం అర్బన్ పట్టణ ప్రధాన కార్యదర్శ రామాంజనేయులు, ధర్మవరం మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు వెంకట కిషోర్, సికేపల్లి పల్లి మండల ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు రాంప్రసాద్, కృష్ణ తేజ, లక్ష్మయ్య ,సకల చంద్రశేఖర్, సాయి గణేష్, కుళ్లాయప్ప, రఫీఅహమద్ ,,పి రామకృష్ణ, మని మాల, యాస్మిన్ సుల్తానా, విజయలక్ష్మి, బాలగోండ్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు