- Advertisement -
విశాలాంధ్ర మండపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కి అందజేశారు.


