Homeజిల్లాలుకర్నూలుప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయుధం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయుధం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయుధం వంటిదని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని అన్నారు. శనివారం పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ ఆవరణం వరకు విద్యార్థులు చేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు