మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని 40 వార్డులలో 17,951 మంది పెన్షనర్లు ఉండగా బుధవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు 17,076 మంది పెన్షన్ దారులకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా పలుచోట్ల తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. నేరుగా పెన్షన్ దారులతో మాట్లాడడం జరిగిందని ఎవరికి ఎటువంటి లంచము ఇవ్వరాదన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి జనవరి రెండవ తేదీ లోపల ఇంటికి వెళ్లి మా సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ.. భాస్కర్ రాయల్ పాల్గొన్నారు.పెన్షన్ పంపిణీలో ధర్మవరం రూరల్ జిల్లాలో టాపర్గా నిలిచింది. ఎంపీడీవో సాయి మనోహర్.
ధర్మవరం మండలం రూరల్ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయితీలలో గల గ్రామాలకు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పెన్షన్ పంపిణీలో జిల్లాలో టాపర్గా నిలచడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో 6,729 మంది పెంచేదారులు ఉండగా 6,345 మందికి పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని, దీంతో 94.05 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా రేగాటిపల్లి, తుమ్మల, సుబ్బారావుపేట గ్రామాలలో తాను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. పెన్షన్ దారులతో నేరుగా మాట్లాడడం జరిగిందని ఎవరికి ఎటువంటి లంచం ఇవ్వరాదన్న విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణములో 95 శాతము పెన్షన్లు పంపిణీ చేశాం..
- Advertisement -
RELATED ARTICLES


