Homeజిల్లాలుఅనంతపురంప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.ఎంఎల్ఎ అస్మిత రెడ్డి

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.ఎంఎల్ఎ అస్మిత రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. శనివారము పెద్ద పప్పూరు మండల పరిధిలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి, పెండేకల్లు రిజర్వాయర్ కి ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాగల్లు రిజర్వాయర్ కి 460 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందన్నారు. చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి 250 క్యూసెక్కులు, పెండేకల్లు రిజర్వాయర్ కు 200 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కింద చిన్న కాల్వలను పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వాన్ని కోరమన్నారు. రిజర్వాయర్ల కింద చిన్న కాల్వలు పూర్తయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి, పెండేకల్లు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జెసి. అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వాయర్ అధికారులు, సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు