Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు తాము కట్టుబడి ఉంటాం..

రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు తాము కట్టుబడి ఉంటాం..

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, డి ఆర్ యు సి సి ఎక్స్ నెంబర్ బండి రాము
విశాలాంధ్ర ధర్మవరం;; రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, డి ఆర్ యు సి సి ఎక్ష్ నెంబర్ బండి రాము తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశము స్టేషన్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద అభివృద్ధి జరిగినా స్టేషన్లో ముఖ్యమైన సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు, ఆర్చి నిర్మాణం, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి మనోజ్ తో పాటు శ్రీనివాస్ వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజల నుండి సలహాలను స్వీకరించి జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి విపులంగా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జి సూర్యనారాయణ, రిటైర్డ్ కమర్షియల్ సూపర్డెంట్ మనోహర్ గుప్తా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, కమర్షియల్ సూపర్వైజర్ ముద్దన్న, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కిరణ్ కుమార్, చీఫ్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు