విశాలాంధ్ర: చిలమత్తూరు,…కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అనే సామెత వినే ఉంటారు హిందూపురం నియోజకవర్గంలో వైసిపి మాత్రం కొండ నాలుక కు మందు వేయకుండా ఉన్న నాలుకను కోసుకుంటుంది, చెయ్యికి గాయమైతే చేయి నరికేస్తామా..! కానీ ఆ నియోజకవర్గంలో జరిగింది. వైసీపీలో రచ్చకెక్కిన నాయకులను కూర్చుండబెట్టి మాట్లాడాల్సిన అధిష్టానం వారి మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది, దీంతో ఇద్దరు కీలక నేతలను సస్పెన్షన్ కు గురి చేసింది. ఇందులో ఆంతర్మేమిటోనని అర్థం కాని పరిస్థితి నెలకొంది, హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీకి దివంగత నేత తారక రామారావు టిడిపిని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కంచుకోటుగా మారిపోయింది, ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా ఆ పార్టీని కదిలించలేకపోయారు అయితే వైసిపి స్వీయ తప్పిదాల వలన రెండుసార్లు గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ముఖ్యంగా వైసీపీలో కీలక నేత నవీన్ నిక్చల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు హిందూపురంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు, ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి రికార్డ్ స్థాయిలో ఓట్లను సంపాదించారు. ఓడిపోయినను తన ప్రభావం చూపారు. 2014లో వైసీపీ నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు, 2019 వైసీపీలో స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మహమ్మద్ ఇక్బాల్ దించారు, దీంతో టిడిపి మరింతగా పుంజుకుని విజయకేతనం ఎగరవేసింది, అలాగే 2024లో వైసిపి అంతర్గత రాజకీయాలు తో తప్పుటడుగు వేస్తూ వచ్చింది, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడైన వేణురెడ్డి సతీమణి కురుబ దీపకను వైసిపి అభ్యర్థిగా ప్రకటించారు దీంతో టీడీపీలో మరింతగా బలపడి మెజార్టీతో విజయం సాధించింది, ఇటీవల జులై 8 న హిందూపురంలో వైయస్సార్ జయంతి ని ఎవరికి వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు, దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా జరిగిన కొద్ది రోజులకే అధిష్టానం నుంచి నవీన్ నిక్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి పై ఐ కమాండ్ సస్పెన్షన్ వే టు వేసింది, దీంతో ఆ పార్టీలో నాయకులను మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఓకే తాటిపై నడవాలని సూచించారు, అయితే నవీన్ నిచల్ 15 సంవత్సరాలుగా బాలయ్యతో పోటీ పడుతున్న వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ గిఫ్ట్ గా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు, అధిష్టానం ముందు నుంచి ఇవే తప్పులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, అయినను నా వంతు కురుబ దీపికకు సహాయ సహకారాలు అందించానన్నారు, పార్టీకి సహకారాలు అందించలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు, ఏది ఏమైనా నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని, జగన్ తోనే ఉంటానని, స్థానిక ఎన్నికల్లో నేనేంటో పార్టీకి తెలిసేలా చేస్తానని తెలిపారు, 2029 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా ఉంటానన్నారు, అదేవిధంగా కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీలో కీలక నేతగా ఉన్నను అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమన్నారు, దీంతో హిందూపురం కంచుకోటలో టిడిపి మరింత బలపడుతుందని వైసిపి తీసుకున్న నిర్ణయం బాలయ్యకు కలిసి వస్తుందనీ పలువురు మేధావులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
వైసీపీలో కీలక నాయకులు ను సస్పెన్స్ చేయడంలో ఆంతర్యం ఏమిటో….
- Advertisement -
RELATED ARTICLES


