విశాలాంధ్ర పుట్టపర్తి: – వ్యాపార లావాదేవీల్లో పలు మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన దాల్ మిల్ సూరి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్న విలేకరులతో మాట్లాడుతూ పుట్టపర్తి లో ఆమె సూరి కి సంబంధించి పలు కేసుల వివరాలను వెల్లడించారు. దాల్ మిల్ సూరి పై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయన్నారు .అదేవిధంగా ఒక ఆస్తి తగాలకు సంబంధించి కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో 307 కేసు నమోదు చేశామన్నారు. అంతర్ రాష్ట్రాలలో కూడా ఆయన నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. బియ్యం, ఆయిల్, సిమెంట్, పప్పు దినుసులు ఇలా పలు వ్యాపారాలు చేస్తూ మధ్య వ్యాపారులను, రైతులను గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నట్లు తెలియజేశారు. సమస్య తీవ్రంగా మారినప్పుడు మోసపోయిన వ్యక్తులకు ఎంతో కొంత చెల్లించి జాగ్రత్తలు పడుతూ వస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఇటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దాల్మిల్ సూరికి సంబంధించిన కేసులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కూడా సమాచారం అందించామన్నారు. దాల్ మిల్ సూరి కి సంబంధించిన సమాచారం అందించిన వారిని పోలీసు శాఖ తరపున సన్మానిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి విజయ్ కుమార్, కొత్తచెరువు సీఐ మారుతి శంకర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దాల్ మిల్ సూరిపై లుక్ అవుట్ నోటీసులు-జిల్లా ఎస్పీ రత్న
- Advertisement -
RELATED ARTICLES


