Homeజిల్లాలుఅనంతపురండి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం

డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా గురువారం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డి ఈ ఐ సి ), కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో వైద్య సిబ్బంది, డీఈఐసీ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినికిడి లోపాలపై అవగాహన పెంపొందించడం, ముందస్తు గుర్తింపు మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా వినికిడి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా 11 మంది పిల్లలకి ఉచితంగా హియరింగ్ ఎయిడ్స్ మరియు కలర్స్ క్రేయాన్స్ పంపిణీ చేయడం జరిగింది.
అధికారులు మాట్లాడుతూ… చిన్నారుల వినికిడి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే, వారి భవిష్యత్తు మెరుగ్గా ఉండగలదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలలో వినికిడి సంబంధిత సమస్యలు గమనించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఈఐసీ వైద్యులు, డిఇఐసి మేనేజర్, ఆడియోలజిస్ట్‌లు, థెరపిస్టులు మరియు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు