- Advertisement -
కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతు వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గవరవరం గ్రామ కమిటీ వైసిపి ప్రెసిడెంట్ శీమకుర్తి సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గవరవరం గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సత్యనారాయణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


