మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌కు అమెరికా అన్ని విధాలా అండగా నిలుస్తూ రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేసింది. 50 రోజుల్లోగా యుద్ధాన్ని ముగించాలని హెచ్చరించింది. లేకుంటే తీవ్రస్థాయిలో సుంకాలు విధిస్తామని తేల్చిచెప్పింది. రష్యాతో వ్యాపారం చేయొద్దంటూ ఇప్పటికే ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరికలు చేసింది. దీనిని రష్యా తీవ్రంగా పరిగణించింది.అమెరికాకు తలొగ్గం… బెదిరింపులకు భయపడమంటూ రస్యా తేల్చిచెప్పింది. సుంకాల పేరిట బెదిరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ ర్యాబ్కావ్ స్పందిస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో దౌత్య పరిష్కారాన్ని రష్యా కోరుతోందని, ఇందుకోసం సంప్రదింపులకు సిద్ధంగా ఉందని అన్నారు. తమ ప్రతిపాదనకు తగిన స్పందన లభించకపోయినా, దౌత్యపద్ధతుల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయినా ప్రత్యేక సైనిక చర్యలు కొనసాగుతాయని సెర్గీ వెల్లడిరచారు. మాస్కో స్థానాన్ని ఎవరూ కదల్చలేరని చెప్పారు. తమ మాటలను తేలికగా తీసుకోవద్దని వాషింగ్టన్కు, నాటోకు స్పష్టంచేశారు. అదే విధంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయాన్ని ఖండిరచారు. నాటో దేశాలు శాంతికి కట్టుబడి ఉన్నాయా అన్న సందేశం కలుగుతోందని చురకలు అంటించారు. మరోవైపు ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించిన దేశ వార్‌టైమ్ స్టేటస్, సైనిక సమీకరణను మరో 90 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది.
అమెరికా బెదిరింపులకు భయపడం: రష్యా
- Advertisement -
RELATED ARTICLES


