మంటల్లో ఐదంతస్తుల భవనం
60 మంది సజీవ దహనం
బాగ్దాద్: తూర్పు ఇరాన్‌లోని అల్ కుత్ నగరంలోని హైపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది సజీవ దహనం కాగా 11 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు నగర ఆరోగ్య అధికారులు, పోలీసులు గురువారం వెల్లడిరచారు. ఐదంతస్తుల భవనం కాలిపోతుండగా, మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళసభ్యులు శ్రమించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చనిపోయిన 60 మందిలో 59 మందిని గుర్తించామని, బాగా కాలిపోవడంతో ఒకరి గుర్తింపు తెలియలేదని నగరాధికారి అలి అల్ మయాహి వెల్లడిరచారు. ఇంకా మంటల్లో మృతదేహాలు ఉన్నందున సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రావిన్స్ గవర్నర్ మాట్లాడుతూ దర్యాప్తు నివేదిక 48 గంటల్లోగా అందుతుందని, ఆ తర్వాతే వివరాలు తెలుస్తాయన్నారు. భవనం యజమాని, మాల్ నిర్వాహకులపై కేసు పెట్టినట్లు గవర్నర్ వెల్లడిరచారు.
ఇరాక్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
- Advertisement -
RELATED ARTICLES


