- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ (39) రాజీనామా చేశారు. జెలెన్‌స్కీ ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణకు ఇది తొలి సూచిక కాగా, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి నియామకానికి అవకాశముంది. ఉక్రెయిన్ ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా యూలియా స్వైరైదెకో ఉన్నారు. ఆమెను ప్రధాని పదవి కోసం జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రతిపాదించారు. అమెరికా, ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చల్లో యూలియా కీలకంగా వ్యవహరించారు. పశ్చిమ దేశాలతో జరిగిన ఉన్నతస్థాయి చర్చల్లోనూ క్రీయాశీల పాత్ర పోషించారు.


