వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కీవ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. అయితే ఆ ఖర్చును యూరోపియన్ యూనియన్ (ఈయూ) భరిస్తుందని పేర్కొన్నారు. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో మాట్లాడుతూ… ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రష్యాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్‌కు సైనిక మద్దతుపై జరుగుతున్న చర్చలలో భాగంగా తాను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో త్వరలో సమావేశం కానున్నానని ట్రంప్ తెలిపారు. ఈ నెలలో కీవ్ పై రష్యా జరిపిన డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు దారుణమని విమర్శించారు. ‘‘నేను నాటో సెక్రటరీ జనరల్‌తో సమావేశం కాబోతున్నాను. ఆయన మంగళవారం యూఎస్ వస్తున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి చాలా అధునాతన సైనిక ఆయుధాలను పంపబోతున్నాం. అయితే, ఈ ఆయుధాలను తాము ఉచితంగా ఇవ్వబోం. ఉక్రెయిన్ ఆయుధాలకు 100 శాతం చెల్లిస్తుంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము ఉక్రెయిన్‌కు పంపే పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థల సంఖ్యను ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ తెలిపారు. ఈ ఆయుధాలకు అయ్యే ఖర్చు యూరోపియన్ యూనియన్ చెల్లిస్తుందని చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరం. ఎందుకంటే పుతిన్ నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. పుతిన్ చాలా చక్కగా మాట్లాడుతాడు. సాయంత్రం అయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడు. అక్కడే కొంచెం సమస్య ఉంది. ఆ ప్రవర్తన నాకు నచ్చట్లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నాటో మిత్రదేశాలకు ఆయుధాలను అందిస్తుందని, ఆ తర్వాత వాటిని ఉక్రెయిన్‌కు బదిలీ చేయవచ్చని ఇటీవలే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం ధ్రువీకరించారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తాం: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


