Homeజిల్లాలుతూర్పు గోదావరిఎస్‌ యానం బీచ్‌లో సంక్రాంతి బందోబస్తు పరిశీలన

ఎస్‌ యానం బీచ్‌లో సంక్రాంతి బందోబస్తు పరిశీలన

- Advertisement -

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం – ఎస్పీ రాహుల్‌ మీనా

విశాలాంధ్ర అమలాపురం : సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎస్‌ యానం బీచ్‌లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగ రోజుల్లో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్‌ నియంత్రణ : వాహనాల రద్దీ వల్ల అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. భద్రత : మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలి. బీచ్‌ సేఫ్టీ : సముద్ర స్నానాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. పరిశీలనలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, డిఎస్పి టిఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, రూరల్‌ సీఐ ప్రశాంత్‌ కుమార్‌, ఎస్సై రాజేష్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు పోలీస్‌ సూచనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ఎస్పీ రాహుల్‌ మీనా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు