Homeఆంధ్రప్రదేశ్ఏపీకి భారీ పెట్టుబడులతో ఆరఎంజెడ్

ఏపీకి భారీ పెట్టుబడులతో ఆరఎంజెడ్

- Advertisement -

దావోస్‌లో మంత్రి లోకేశ్ సమక్షంలో సంస్థ చైర్మన్ ప్రకటన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆరఎంజెడ్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్‌లో ఆరఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేశ్ జరిపిన చర్చలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్‌లో లక్షమంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు సంస్థ భారీ పెట్టుబడులతో రానుంది. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖనగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం కాపులుప్పాడ మొదటి దశ ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ అభివృద్ధికి ఆరఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఆ సంస్థ చైైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్‌డ్ యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే… విశాఖపట్నాన్ని నెక్ట్స్ జెన్‌మిక్స్ యూజ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా ఒక గిగావాట్ వరకు లక్ష్య సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరం. ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ జెన్ డిజిటల్, ఏఐ వర్క్ లోడ్‌కు మద్దతు ఇస్తుంది. స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. మరోపక్క రాయలసీమలో టేకులోడు వద్ద సుమారు 1,000 ఎకరాలలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి కూడా ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటిపై కలిపి రాబోయే ఐదేళ్లలో ఆరఎంజెడ్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానం ద్వారా కాలపరిమితులతో కూడిన అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఏపీ ప్రభుత్వం తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు