Homeజాతీయంఏపీలోనేపెట్రోల్ ధర అధికం

ఏపీలోనేపెట్రోల్ ధర అధికం

- Advertisement -

న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా… ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ… ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల పెంపు తక్కువగా ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి ధరల సవరణ తర్వాత దేశంలోని మూడు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 మార్కు దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.117 దాటింది. దేశంలోనే ఇక్కడ ఇంధన ధరలు అత్యధికం. ఏపీ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు లీటరుకు రూ.4 చొప్ప్పున అదనపు పన్ను, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ విధిస్తోంది. దీనివల్ల ఇక్కడ ఎఫెక్టివ్ పన్ను రేటు దాదాపు 35 శాతానికి చేరుతోంది. తెలంగాణలో కూడా భారీగా వ్యాట్ వసూలు చేస్తుండటంతో లీటర్ పెట్రోల్ ధర రూ.116కు చేరువైంది. కేరళలో బేస్ వ్యాట్‌తో పాటు సామాజిక భద్రతా సెస్ అదనంగా విధిస్తుండటంతో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హర్యానా, గోవా, అసోం వంటి ఆరు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104 లేదా అంతకంటే తక్కువగా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు