Homeజాతీయంపెట్రోలు, డీజిల్ ధర పెంపు ఉండదు: కేంద్రం

పెట్రోలు, డీజిల్ ధర పెంపు ఉండదు: కేంద్రం

- Advertisement -

న్యూదిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం నిజం కాదని కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ధరల పెంపు వదంతులు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలతో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ మేరకు స్పష్టత నిచ్చారు. ‘కొన్ని చోట్ల భయాందోళనలతో ముందస్తుగా ఇంధన కొనుగోళ్లు జరపడాన్ని మేము గమనించాం. మేము రాష్ట్ర ప్రభుత్వా లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు. ఇంధన లభ్యతను నిర్ధారించడానికి అన్ని రిటైల్ అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నామని… ఎక్కడా కొరత ఏర్పడకుండా సరఫరా జరిగేలా చూస్తున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. డిమాండ్‌కు సరిపడా దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయన్నారు. ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండబోదన్నారు. కాగా, పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.20, డీజిల్‌పై లీటరుకు దాదాపు రూ.100 చొప్ప్పున చమురు సంస్థలు నష్టపోతున్నాయని సుజాత శర్మ ఇంతకుముందు చెప్పారు. ప్రస్తుతం దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 కాగా, డీజిల్ ధర రూ. 87.67గా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు