Homeవ్యాపారంప్రైమ్‌ వీడియో కొత్త బ్రాండ్‌ ప్రచారం

ప్రైమ్‌ వీడియో కొత్త బ్రాండ్‌ ప్రచారం

- Advertisement -

ముంబై : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే వినోద గమ్యస్థానం అయిన ప్రైమ్‌ వీడియో, తాజాగా తమ కొత్త బ్రాండ్‌ ప్రచారాన్ని విడుదల చేసింది. ‘ప్రతి భావోద్వేగం.. అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది’ అంటూ తీర్చిదిద్దిన ఈ ప్రచార చిత్రం, ప్రైమ్‌ వీడియో సిరీస్‌, సినిమాలలోని భావోద్వేగాలను ప్రతిధ్వనింప చేయటంతో పాటుగా ప్రైమ్‌ వీడియో కేటలాగ్‌ వైవిధ్యం, విస్తృతమైన ఇతివృత్తాలు, శైలులు, భాషలు, కథ చెప్పే తీరును కూడా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తుంది. నిర్దిష్ట మార్కెట్‌ల కోసం రూపొందించిన ఈ రెండు ప్రకటన చిత్రాలలో ప్రముఖ భారతీయ నటులు మనోజ్‌ బాజ్‌పేయి, సమంత నటించారు. ‘‘ప్రైమ్‌ వీడియో వద్ద, వినోదం అంటే విభిన్న జెనర్‌ బాక్స్‌ లను టిక్‌ చేయడం కాదని మేము నమ్ముతాము – ఇది కస్టమర్లతో భావోద్వేగపరంగా కనెక్ట్‌ అయ్యే అనుభవాలను అందించడం గురించి’’ అని ప్రైమ్‌ వీడియో, ఇండియా డైరెక్టర్‌, మార్కెటింగ్‌ హెడ్‌ సోనాల్‌ కబీ అన్నారు. ‘ప్రతీ భావోద్వేగం.. అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది’ అనేది కేవలం ఒక లైన్‌ కాదు – ఇది తమ సిరీస్‌, సినిమాల ద్వారా తాము ప్రతిరోజూ అందించే వాగ్దానం..’’అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు