Homeభారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం

భారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం

- Advertisement -

శ్రీనగర్‌: ఉగ్రనిరోధక చర్యల్లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు భారీ విజయం సాధించారు. హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్‌ గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహమ్మద్‌, అన్సార్‌ ఘజ్‌వత్‌-ఉల్‌-హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారు. పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు ప్రతినిధి వెల్లడిరచిన వివరాల ప్రకారం ‘అక్టోబరు 19న శ్రీనగర్‌లోని బన్‌పొరా నౌగామ్‌ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్‌ పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారం పై ఉపా చట్టంతోపాటు ఆయా చట్టాల కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌తో కూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. ఈ బృందానికి పాకిస్థాన్‌, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో అవసరమైన నిధులు సేకరించారు. వ్యక్తుల్లో తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్రసంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్‌ ఏర్పాటు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు ఐఈడీల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణలో పాల్గొన్నట్లు గుర్తించాం. ఈ కార్యకలాపాల సమన్వయం కోసం నిందితులు ఎన్‌క్రిప్టెడ్‌ ఛానెళ్లను ఉపయోగించారు’ అని పోలీసు ప్రతినిధి వెల్లడిరచారు. అరెస్టైన వైద్యుల్లో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన డా.ఆదిల్‌, పుల్వామాకు చెందిన డా.ముజమ్మిల్‌ అహ్మద్‌, లక్నోకు చెందిన డా.షాహీన్‌ ఉన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డా.ముజమ్మిల్‌ అహ్మద్‌ అద్దె నివాసంలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతడు అల్‌ ఫలాప్‌ా విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్‌లో జైషే మమహ్మద్‌ పోస్టర్లు వేసిన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని అరెస్టు చేసినట్లు అంతకుముందు ఫరీదాబాద్‌ కమిషనర్‌ సతేందర్‌ కుమార్‌ గుప్తా వెల్లడిరచారు. మరోవైపు షాహీన్‌ కారులో ఓ ఏకే-47 రైఫిల్‌ లభ్యమైంది. ‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని ఆయా ప్రాంతాలతోపాటు హర్యానాలోని ఫరీదాబాద్‌, ఉత్తరప్రదేశ్‌లోని సహారాన్‌పూర్‌లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించాం. ఈ క్రమంలోనే మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడిరది. వారినీ అరెస్టు చేస్తాం. ఇప్పటివరకు ఓ చైనీస్‌ స్టార్‌, బెరెట్టా పిస్టల్స్‌, ఏకే 56, ఏకే క్రింకోవ్‌ రైఫిళ్లు, 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. నిధులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది’ అని జమ్మూకశ్మీర్‌ పోలీసు ప్రతినిధి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు