చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బొత్స, ఈశ్వరయ్య హాజరు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి ఎన్.భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నెవా, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామ కృష్ణరాజు, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేశ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంతి ఎస్.సవిత, వ్యవసాయ శాU మంత్రి కె.అచ్చెన్నా యుడు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కె.శ్రీనివాస్, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, కార్యవర్గసభ్యులు టి.మనోహర్‌నాయుడు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు, సీఎస్, డీజీపీ, ఐఏఎస్ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, రక్షణ శాఖ సిబ్బంది, క్రీడాకారులు, పద్మ అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, మహిళా సర్పంచ్‌లు, మెరిట్ విద్యార్థులు, ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు తేనీటి విందుకు హాజరయ్యారు. ముందుగా గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ వారు కూర్చున్న టేబుళ్ల వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు.


