Homeసజీవంగా పట్టుకొని కాల్చిచంపారు

సజీవంగా పట్టుకొని కాల్చిచంపారు

- Advertisement -

. విద్రోహుల సమాచారంతోనే ఎన్‌కౌంటర్‌
. నంబాల ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ

విశాలాంధ్ర – చింతూరు : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని కాల్చిచంపారని మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. ఆ లేఖలో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన కారణాలు పేర్కొన్నారు. ‘లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. 6 నెలలుగా కేశవరావు అబూజ్‌మడ్‌ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు తెలుసు. కేశవరావు బృందంలో ఉన్న ఆరుగురు ఇటీవలే లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. యూనిఫైడ్‌ కమాండో సభ్యుడు దేశ ద్రోహిగా మారాడు. అతనితోపాటు కొంతమంది ద్రోహం చేశారు. ఎన్‌కౌంటర్‌ ముందు రోజు నుంచి 20 వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో ఐదు ఎన్‌కౌంటర్లు జరిపాయి. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భందించాయి. కేశవరావును కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షింతంగా బయటపడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకుని ఎన్‌కౌంటర్‌ చేశారు. మమ్మల్ని వదిలి కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. కేశవరావు ముందుండి మాతోటే నడిచారు. ప్రాణాల్ని పణంగా పెట్టారు. మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం. ఈ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. అయితే, మరో మృతదేహాన్ని మేం తీసుకెళ్లాం. దాయాది పాకిస్తాన్‌ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం… మేము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు.
కగార్‌ పేరుతో జరుగుతున్న ఊచకోత వెనుక ప్రభుత్వ నిజమైన ఉద్దేశాన్ని మన దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం. దేశాన్ని, దాని వనరులను కాపాడటానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలి. దేశాన్ని, వనరులను అమ్మేవారికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడండి. ఉగ్రవాదులతో కలిసి జీవిస్తున్న పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం ఎందుకు ముందుకు వచ్చిందో ప్రశ్నించండి. మన దేశ ప్రజాస్వామ్య, విప్లవాత్మక ప్రజలు శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేస్తు న్నారు. కానీ ప్రభుత్వం వినడం లేదు. వందలాది మంది గిరిజన ప్రజలు, నిరసనకారులను హత్య చేయడానికి ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో ప్రధాని మోదీ నోరు మూయించింది ఎవరు? దేశంలో దేని విజయం కోసం తిరంగ యాత్ర నిర్వహిస్తారు? ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా? దీని అర్థం మనం పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకుంటు న్నామని కాదు. దేశ ప్రజలు, పెద్ద కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల మధ్య సంఘర్షణను అర్థం చేసుకోండి. అవసర మైనప్పుడల్లా వారు ఈ ప్రజలకు అలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటారని లేఖలో పేర్కొన్నారు. అమరుడు నంబాల కేశవరావుకు విప్లవ జోహార్లు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు