Homeఅంతర్జాతీయంహ్యాకర్ల దెబ్బకు 158 ఏళ్ల బ్రిటన్‌ కంపెనీ మూత

హ్యాకర్ల దెబ్బకు 158 ఏళ్ల బ్రిటన్‌ కంపెనీ మూత

- Advertisement -

లండన్‌: బ్రిటన్‌కు చెందిన కేఎన్‌పీ లాజిస్టిక్స్‌ అనే కంపెనీ హ్యాకర్ల దెబ్బకు మూతబడిరది. 158 ఏళ్ల నుంచి రవాణా రంగంలో ఉన్న ఈ కంపెనీ 500 లారీలను ‘ది నైట్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌’ అనే బ్రాండ్‌ కింద నడుపుతోంది. పారిశ్రామిక ప్రమాణాలను బలంగా పాటిస్తుంది. ఈక్రమంలో సైబర్‌ అటాక్‌ బీమా కూడా తీసుకొంది. కానీ ‘అకిర’ గ్యాంగ్‌ హ్యాకర్ల రాన్సమ్‌వేర్‌ బారినపడిరది. హ్యాకర్లు కేఎన్‌పీ సిస్టమ్స్‌లోకి చొరబడి డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేశారు. ఉద్యోగులు దానిని వినియోగించే వీల్లేకుండా చేశారు. డేటాను తిరిగొ పొందాలంటే నగదు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.‘మీరు ఇది చదివితే… మీ కంపెనీ అంతర్గత సమాచారం పూర్తిగా లేదా పాక్షికంగా నాశమైందని అర్థం. కన్నీళ్లు, కోపాన్ని దిగమింగుకొని చర్చలకు రండి’ అని ఓ సందేశాన్ని హ్యాకర్లు పంపారు. ఐదు మిలియన్‌ పౌండ్లు (రూ.58 కోట్లు) డిమాండ్‌ చేసినట్లు నిపుణులు అంచనా ఉంది. అంత మొత్తం చెల్లించలేని ఈ కంపెనీ డేటా మొత్తం కోల్పోయింది. ఫలితంగా కంపెనీ మూతపడిరది. దీంతో 700 మందికిపైగా కార్మికుల బతుకులు వీధినపడ్డాయి. గతంలోనూ బ్రిటన్‌కు చెందిన ఎంÊఎస్‌, కో-ఆప్‌, హారోడ్స్‌ కూడా సైబర్‌ దాడులకు గురయ్యాయి. కో-ఆప్‌లో 65 లక్షల మంది డేటాను అపహరించారు. కేఎన్‌పీ ఘటనపై జాతీయ సైబర్‌ భద్రతా కేంద్రం సీఈవో రీచర్డ్‌ హోర్నె స్పందించారు. ‘మన వ్యాపారాలు భద్రంగా ఉండాలంటే సిస్టమ్స్‌ మరింత సురక్షితంగా ఉండాలి’ అని సూచించారు. కంపెనీలోని ఉద్యోగుల లాగిన్‌ పాస్‌వర్డ్‌ల ద్వారానే హ్యాకర్లు సిస్టమ్స్‌లోకి చొరబడినట్లు కేఎన్‌పీ డైరెక్టర్‌ పౌల్‌ అబాట్‌ తెలిపారు. అయితే ఏ ఉద్యోగి వివరాలు వాడారనేవిది చెప్పలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు