Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నమ్మకం కలిగించని బడ్జెట్‌

నిరుద్యోగం, ధరల పెరుగుదల, సమాజంలో కొంత మంది కుబేరులై పోవడం, అత్యధిక శాతం ప్రజలు బతుకీడ్వడమే కష్టం అయిపోతున్న సమయంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఏ మాత్రం ఊరట కలిగించలేదు. అక్కడక్కడా చిన్న చిన్న సదుపాయాలు మాత్రం కల్పించారు. కొత్త పన్నుల విధానాన్ని అనుసరించే వారికి రూ. 17.5000 కోట్లు మిగులుతాయని ఆర్థిక మంత్రి అంటున్నారు. ఈ బడ్జెట్‌లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమిటంటే గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం అనుసరించిన కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాన్ని యథాతథంగా కొనసాగించడమే. కార్పొరేట్‌ సంస్థల మీద ఉన్న ప్రేమాభిమానాలు సామాన్య జనం మీద ఎంతమాత్రం లేవని నిర్మలా సీతారామన్‌ ఏడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొహమాట పడకుండా నిరూపించారు. మోదీ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడుతుందో మరోసారి రుజువు అయింది. ఉపాధి అవకాశాలు పెంచడానికి తీసుకున్న నిర్దిష్టమైన చర్యలు ఏవీ నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో వినిపించనే లేదు. ఈ బడ్జెట్‌లో ద్యోతకం అయ్యేదల్లా గత పదేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడమే. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు ముసుగు కప్పడంలో నిర్మలా సీతారామన్‌ అద్భుతమైన కౌశలం ప్రదర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర చాలా ఏళ్లుగా తగ్గుతూనే ఉంది. అలాంటి సమయంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను అంచెలంచలుగా సామాన్యుల నడ్డివిరిచే స్థాయికి వెళ్లినా ఈ భారం తగ్గించడానికి చేసింది ఏమీలేదు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు జనంమీద భారం తగ్గించి అభివృద్ధి కార్యకలాపాలకు ఊతం ఇవ్వాలన్న ధ్యాస మోదీ ప్రభుత్వానికి ఎన్నడూ లేదు కనక ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఉపశమనం కలుగుతుందని ఆశించడం దండగ. లోక్‌సభలో మొహం వాచిపోయిన మోదీ ప్రభుత్వం తెలుగుదేశం, జె.డి.(యు) పార్టీల మద్దతుతో మనుగడ కొనసాగిస్తోంది. అంటే మోదీ ప్రభుత్వం కొయ్య కాళ్ల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. పోనీ ఆపత్కాలంలో తమను ఆదుకున్న ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు దోచిపెట్టింది ఏమైనా ఉందా అంటే లేదు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలని అంచనా. పదేళ్ల నుంచి, ముఖ్యంగా వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిగా కుంటుపడిరది. అమరావతిలో రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు దీర్ఘ కాలిక కల. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర విభజన తరవాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీనే. కాని అప్పుడు ఆయన ఇచ్చింది పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లు మాత్రమే. ఇప్పుడు తెలుగు దేశం మద్దతు ఎంత అవసరమైనా రూ. 15,000 కోట్లు ఇస్తామనడం లేదు. ఇప్పిస్తామంటున్నారు. అంటే బడ్జెట్‌లో అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. ఆ 15,000 కోట్లు రుణాల రూపంలో ఇప్పిస్తామన్నది నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో దాగిన అసలు సత్యం. బీహార్‌కో, ఆంధ్రప్రదేశ్‌ కో నిధులు కేటాయిస్తే అభ్యంతర పెట్టవలసిన పనిలేదు. కాని కేరళ, తమిళనాడు, ఒడిశా కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక కేటాయింపు అడుగుతున్నా ఆర్థిక మంత్రి కిమ్మనలేదు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించకూడదు. ఒక్క ఒడిశాను మినహాయిస్తే తమిళనాడు, కేరళ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్ష రాష్ట్రాలకు నిధులు కేటాయించడానికి నిర్మలా సీతారామన్‌కు ఇప్పటిదాకా మనసు ఒప్పలేదు. రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆలోచనే లేదు. నిష్పక్షపాతంగా నిధులు కేటాయించడానికి ఉపకరించిన ప్రణాళికా సంఘాన్ని మోదీ సర్కారు తోసి పారేసింది. దాని స్థానంలో ఏర్పాటు అయిన నీతి ఆయోగ్‌ వల్ల అవసరమైన రాష్ట్రాల అవసరాలు తీరిన సందర్భమే లేదు.
2014లో అధికారంలోకి రావడానికి మోదీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఆ మాట అనంత వాయువుల్లో కలిసి పోయింది. ఇప్పుడు కొత్త నాటకం మొదలెట్టారు. 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి కలిగిస్తారట. ఒక కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామనడం లేదు. కానీ శిక్షణ ఇప్పిస్తారట. ఈ రెండు పనులూ చేయడానికి అయిదేళ్లు పడ్తుంది. ఉద్యోగాలు లేక అనేక మంది విద్యార్హత ఉన్నవారు కూడా వందలు, వేలు ఖాళీలు ప్రకటిస్తే లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటున్న దుస్థితిలో ఉన్నాం. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఈ బడ్జెట్‌లో పూజ్యం. అలాంటి దిశగా బడ్జెట్‌ ప్రసంగంలో ఒకటో రెండో మాటలు దొర్లినా గతానుభవంతో చూస్తే అవీ బూటకపు వాగ్దానాలేనని తేలక తప్పదు. విద్య, ఆరోగ్యం లాంటి సాంఘిక సంక్షేమానికి కేటాయించే నిధులు ఇసుమంత కూడా పెరగలేదు. కార్పొరేట్‌ సంస్థల లాభాలు అంతకంతకూ పెరుగుతున్నా రాయితీలు దక్కుతున్నది ఆ సంస్థలకే. సామాన్యులు నోట్లో తడి ఆరిపోతుంటే ఎదురుచూస్తూ ఉండాల్సిందే. కార్పొరేట్‌ సంస్థలు చెల్లించే పన్నుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఆదాయపు పన్ను, మరి కొన్ని పరోక్ష పన్నుల ద్వారా సమకూరే రాబడే ఎక్కువ అంటే ఈ ప్రభుత్వం విలోమ విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రామీణ ఉపాధి పథకం కోసం కేటాయించిన నిధులు చతికిలబడడం మొదలై ఏళ్లు గడుస్తోంది. సామాన్యుడి మీద మరింత భారం మోపడానికే బడ్జెట్‌ ప్రతిపాదించే తంతు కొనసాగిస్తున్నట్టుగా ఉంది. యువజన, మహిళ, పేదల, రైతుల సంక్షేమంకోసం పాటు పడ్తామని మోదీ ప్రభుత్వం చెప్పే మాటలన్నీ ఎప్పటిలాగే బూటకం అని ఈ బడ్జెట్‌ తేల్చేసింది. దశాబ్దం పైగా కొనసాగుతున్న మోదీ ఏలుబడిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగడమే తప్ప తగ్గుతున్న ఛాయలే లేవు. నిజానికి ఇది మోదీ ఎజెండాలోనే లేదు. ఈ బడ్జెట్‌ వల్ల కొన్ని వస్తువులు చౌక అవుతాయట. ఆ జాబితా చూస్తే నవ్వొస్తుంది. దిగుమతి చేసుకునే బంగారం, వెండి, మొబైల్‌ ఫోన్లు, వాటి విడిభాగాల ధరలు తగ్గుతాయట. మంచిదే కానీ దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్ల ధర తగ్గితే స్వదేశీ మొబైల్‌ పరిశ్రమలు నెత్తిన గుడ్డ వేసుకోవాల్సిందేగా! దీనివల్ల దొంగ రవాణా తగ్గుతుందట. నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం? విశాఖపట్నం నుంచి చెన్నై దాకా పారిశ్రామికవాడల హారం నిర్మిస్తామంటున్నారు. ఇది అందమైన మరో నినాదం. ఇలాంటి నినాదాలు బడ్జెట్‌లో చాలానే కనిపిస్తాయి. చంద్రబాబు దిల్లీ దాకా వెళ్లి మోదీకి విజ్ఞప్తులు చేసినా ఒరిగింది ఏమీ లేదు. పోలవరం పథకం పూర్తి చేస్తామన్న హామీ మాత్రం పడేశారు. పోలవరం ప్రస్తావన దశాబ్దాల నుంచి వస్తూనే ఉంది. నికరమైన హామీ బడ్జెట్లో ఏమీ కనిపించదు. మోదీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎగబడి మద్దతు ఇస్తున్నా దక్కింది శూన్యమే. బడ్జెట్‌లోనే ఊరట లేనప్పుడు తరవాతెప్పుడో మేలు జరుగుతుందని చంద్రబాబు అనుకుంటే చేసేదేమీ ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img