Tuesday, July 15, 2025
Homeతెలంగాణఅంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి

అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి

గరిష్ట వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు

విశాలాంధ్ర – హైదరాబాద్‌: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సంబంధిత ఫైల్‌పై గురువారం సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్‌ల యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించగా… టీచర్‌ పదోన్నతి ఇవ్వడంలో అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. పదవీవిరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో… 50 ఏళ్ల వయస్సులో టీచర్‌ గా పదోన్నతి పొందే హెల్పర్లు… ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. వేలాది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సీతక్క న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు