Homeవ్యాపారంద్విచక్ర వాహన మార్కెట్ లోకి ఆల్టిగ్రీన్: ‘మిన్సారా’ విడుదల

ద్విచక్ర వాహన మార్కెట్ లోకి ఆల్టిగ్రీన్: ‘మిన్సారా’ విడుదల

- Advertisement -

విజయవాడ: జాకస్న్ గ్రూప్‌లో భాగమైన ఆల్టిగ్రీన్, ‘మిన్సారా’ పేరిట మల్టీ యుటిలిటీ వాహనంను విడుదల చేయటం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి ప్రవేశించింది. చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, సర్వీస్ టెక్నీషియన్లు, రైతులు, గ్రామీణ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించింది. మిన్సారా మూడు వేరియంట్లలో లభిస్తుంది. మిన్సారా ఎస్‌లో 2.78 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 125 కిలోమీటర్ల రేంజ్, ఎస్ ప్లస్‌లో 3.8 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 165 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. మిన్సారా ఎస్ఈ వేరియంట్ బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో అందుబాటులోకి రానుంది. గరిష్ఠంగా 172 ఎన్‌ఎం టార్క్క, 33 శాతం గ్రేడబిలిటీ, గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగం, 264 కిలోల స్థూల వాహన బరువు సామర్థ్యం కలిగి ఉండటంతో పాటుగా కంబైన్¦ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి. మిన్సారా ప్రారంభ ధర రూ.1.24 లక్షలు (ఎక్స్‌షోరూమ్) . బెంగళూరు, విజయవాడ, నోయిడాలోని ఆల్టిగ్రీన్ డీలర్‌షిప్ల ద్వారా బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. డిసెంబరు 1 నుంచి డెలివరీలు చేయనున్నారు. జాకస్న్ గ్రీన్ వెహికల్స్‌ సీఈఓ దీపక్ ఠాకూర్ మాట్లాడుతూ రోజువారీ ప్రయాణాలతో పాటు జీవనోపాధికి సంబంధించిన వివిధ అవసరాలకు ద్విచక్ర వాహనాలను వినియోగించే వారికి అనుగుణంగా మిన్సారాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు