. వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా
. జిల్లా స్థాయిలో 33… రాష్ట్ర స్థాయిలో 3 పర్యవేక్షణ బృందాలు
. రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం
విశాలాంధ్ర – హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేం దుకు రవాణాశాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సచివాలయంలో బుధవారం రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు ,రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు. ప్రతి రోజు విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా ఆయా బృందాలకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. ఓవర్ లోడిరగ్, సాండ్,ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ , చలానాలపై ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. అదనపు పెనాల్టీతో పాటు వాహనాల సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో బృందంలో డీటీసీ ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉంటారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ లపై వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుంచి ఎంవీఐ, ఏఎంవీఐలను నెలవారీ రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీ చేయడానికి ఈ బృందాలను ఉపయోగిస్తారు. ఫిట్నెస్ గడువు ముగిసిన ఈఐబీల జాబితాను సేకరించి, రోడ్లపై తిరుగుతున్నట్లు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. గత వారం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల పై తీసుకున్న చర్యలపై మంత్రి పొన్నం ఆరా తీశారు. 2,576 వాహనాల పై కేసులు నమోదు చేశారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందిలో ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలని, రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ వైద్యసేవలపై అవగాహన కల్పించాలని అన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య పాల్గొన్నారు.


