Homeతెలంగాణఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు

- Advertisement -

విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దానంపై అనర్హత వేటు వేస్తూ కీలక తీర్పుని చ్చింది. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం తీర్పునిచ్చింది. బీఆర్‌ఎస్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేందర్ బరిలోకి దిగడాన్ని వ్యతిరే కిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పునిచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కౌశిక్రెడ్డి, మహేశ్వర్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదంటూ స్పీకర్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 10వ షెడ్యూల్ ప్రకారం కాకుండా… నిబంధనలకు విరుద్ధÝంగా వ్యవహరించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. పార్టీ ఫిరాయింపులపైనా స్పీకర్‌కు వివిధ ఆధారాలు సమర్పించామని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా… సరైన ఆధారాలు లేవని స్పీకర్ ట్రిబ్యునల్ మార్చి 11న ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 21న తీర్పు రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. దానం పార్టీ మారడం, కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని పిటిషనర్లు తమ వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలేదు: దానం నాగేందర్
అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో పోరాడటం నాకు కొత్త కాదు. పోరాటాలు చేసే ఈ స్థాయికి వచ్చా. ఎన్నికలు వస్తే… ప్రజా క్షేత్రంలో పోరాడుతా.. విజయం సాధిస్తా’ అని దానం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు