Homeఅంతర్జాతీయంనేపాల్‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్‌

నేపాల్‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్‌

- Advertisement -

మంత్రులుగా ఖానల్‌, ఫీుసింగ్‌, ఆర్యల్‌ ప్రమాణం

ఖాట్మండు: నేపాల్‌ తాత్కాలిక మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం దక్కింది. కొత్త మంత్రులతో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రామేశోర్‌ ఖానల్‌, కుల్మన్‌ ఫీుసింగ్‌, ఓం ప్రకాశ్‌ ఆర్యల్‌… ఆర్థిక, ఇంధన, హోంశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు.
రామేశోర్‌ ఖానల్‌: రామేశోర్‌ ఖానల్‌ (55) ఆర్థిక శాఖ కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అదే శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌, నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు, నేపాల్‌ టెలికం కంపెనీ, నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ కార్పొరేషన్‌లో పనిచేసిన అనుభవం ఆయనకున్నది. వ్యాట్‌ బిల్లు కుంభకోణం నేపథ్యంలో దర్యాప్తును వాణిజ్య సంస్థలు అడ్డుకోవటం, రాజకీయంగా ఒత్తిడి పెరుగటంతో 2011లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీనామా చేసిన ఆయన వార్తల్లో నిలిచారు. అప్పట్లో రaాలా నాథ్‌ ఖానల్‌ ప్రధానిగా, భరత్‌ మోహన్‌ అధికారి ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
కుల్మన్‌ ఫీుసింగ్‌: కుల్మన్‌ ఫీుసింగ్‌ (54)నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత నేపాల్‌కు వెలుగు వచ్చింది. చాలా సంవత్సరాల్లో మొదటిసారిగా 24 గంటల విద్యుత్‌ సరఫరా జరిగింది. అప్పట్లో దీనిని ఓ అద్భుతంగా అంతా వర్ణించారు. డిమాండును, సరఫరాను దృష్టిలో పెట్టుకొని సమర్థ నిర్వహణ ద్వారా 24 గంటల విద్యుత్‌ సరఫరా సాధ్యమైందని ఆయన అప్పట్లో చెప్పారు. అంధకారానికి అలవాటుపడ్డ నేపాల్‌ ప్రజలకు ఆయన ఒక హీరో అయ్యారు. ఫీుసింగ్‌కు జనాదరణ బాగా పెరిగింది. ఇదే క్రమంలో జెన్‌ జీలోని ఒక దశలో ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలని యోచించిన విషయం తెలిసిందే.
ఓం ప్రకాశ్‌ ఆర్యల్‌: ఓం ప్రకాశ్‌ ఆర్యల్‌ (49) హోంశాఖ బాధ్యత తీసుకుంటున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా అవినీతిని అంతం చేసే వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రధాని కార్కికి నమ్మకస్తుడిగానూ ఆయనున్నారు.
తొలి మహిళా అటార్నీ జనరల్‌గా సబితా భండారి
నేపాల్‌కు తొలి మహిళా అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది సబితా భండారి నియమితులయ్యారు. ప్రధాని సుశీలా కార్కి సిఫార్సు మేరకు సబితా భండారి నియామకానికి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ ఆమోదముద్ర వేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడిరచింది. అంతకుముందు ఆయన అటార్నీ జనరల్‌గా రామేశ్‌ బాదల్‌ రాజీనామాను ఆమోదించారు. ప్రభుత్వం మారినప్పుడు అటార్నీ జనరల్‌ రాజీనామా చేయడం సాధారణమే. భండారి గతంలో జాతీయ సమాచార కమిషనర్‌గానూ పనిచేశారు. ఇప్పుడు దేశానికి తొలి మహిళా అటార్నీ జనరల్‌ అయ్యారు.
3,723 ఖైదీలు తిరిగి జైళ్లకు…
జెన్‌ జీ ఆందోళనల నేపథ్యంలో తప్పించుకున్న 3,723 మంది ఖైదీలను తిరిగి అరెస్టు చేసినట్లు నేపాల్‌ డీఐజీ వినోద్‌ ఫీుమిరే తెలిపారు. మరో 10,320 మంది ఖైదీల కోసం గాలింపులు కొనసాగుతున్నట్లు చెప్పారు. వారి ఆచూకీ కోసం ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడిరచారు. కొందరు ఖైదీలు స్వచ్చంధంగా తిరిగి వచ్చారని, కొందరిని భారత్‌ పోలీసులు పట్టుకొని తమకు అప్పగించారని ఆయనన్నారు. తప్పించుకున్న ఖైదీలను పట్టుకునేందుకు నేపాలీ ఆర్మీ, పోలీస్‌, సాయుధ పోలీసుల దళం సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఐజీ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు