Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో అరుణ ఉత్సవం

ఫ్రాన్స్‌లో అరుణ ఉత్సవం

- Advertisement -

40 వేల మందితో భారీ ప్రదర్శన

పారిస్: ఫ్రాన్స్‌లో అరుణ ఉత్సవం ఉత్సాహభరితంగా జరిగింది. రాజధాని పారిస్‌కు దక్షిణాన ఉన్న లే ప్లెసిస్-పాటేలోని బేస్ ఏరియన్ 217 ఈ ఉత్సవానికి శాశ్వత వేదిక కాగా ‘అంజెలా డేవిస్’ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రాన్స్‌ కమ్యూనిస్టు పార్టీ (పీసీఎఫ్) అధ్వర్యంలో 40,000 మందితో భారీ ర్యాలీ జరిగింది. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అరుణ జెండాలతో విప్లవ గీతాలతో వేడుక నిర్వహించారు. ప్రధాన వక్త పీసీఎఫ్ జాతీయ కార్యదర్శి ఫ్ఙాయన్ రౌసెల్… కార్మికుల హక్కులు, వేతనాల రక్షణ, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఫ్రాన్స్‌ వామపక్ష రాజకీయాల్లో ఈ ప్రసంగం మైలురాయిగా నిలిచింది. ఐక్యతకు పిలుపునిచ్చింది. కార్యక్రమం ముగింపును సూచిస్తూ 40,000 మంది ముఖ్యంగా యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ జాతీయ గీతం ‘లా మార్సెలైస్’ కోసం స్వరం కలిపారు. ప్రపంచ సోషలిస్ట్ ఉద్యమ గీతం ‘ఎల్’ఇంటర్నేషనల్’ ఆలపించారు. మూడు రోజుల రాజకీయ`సాంస్కృతిక ఉత్సవాన్ని ‘ఎల్’ హ్యుమానిటే’ దినపత్రిక నిర్వహించడం ఆనవాయితీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు