170 విమానాలు రద్దు
పారిస్ : ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో 170 విమానాలు రద్దు అయ్యాయి. 30 వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండు కార్మిక సంఘాల అధ్వర్యంలో సమ్మె రెండు రోజ కొనసాగింది. ఫలితంగా నా దేశంలో నడిచే విమానాల్లో దాదాపు 1/4వ వంతు రద్దు అయ్యాయి. అయితే యూనియన్ డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ రవాణా మంత్రి ఫిలిప్ టబరాట్ తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ ఉద్యోగుల సమ్మెపై ర్యాన్‌ఎయిర్ సంస్థ స్పందించింది. ఈ సమ్మె కారణంగా బ్రిటన్, ఐర్లాండ్, స్పెయిన్, గ్రీస్‌కు వెళ్లే విమానాలకు ఇబ్బంది కలిగినట్లు వెల్లడిరచింది.
ఫ్రాన్స్‌లో ‘ఎయిర్ ట్రాఫిక్’ సమ్మె
RELATED ARTICLES