Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఫ్లోరైడ్ నివారణ మన అందరి బాధ్యత

ఫ్లోరైడ్ నివారణ మన అందరి బాధ్యత

విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం ఆదర్శనగర్ యుపిహెచ్సి లో నిర్వహించిన నేషనల్ ప్రోగ్రాం ప్రివెంటేషన్ & కంట్రోల్ ఆఫ్ ఫ్లోరస్ అవగాహన సదస్సు జరిగింది.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఫ్లోరైడ్ నివారణ అధికారిని అరుణ జ్యోతి మాట్లాడుతూ… ఫ్లోరైడ్ నివారణ కోసం ఆర్డబ్ల్యూఎస్&వైద్యారోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతంలో నీటిలో ఉన్న ఫ్లోరైడ్ శాతాన్ని లెక్కించి,ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించినా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, ఫ్లోరైడ్ బాధిత అనుమానితులుపై ఇంటింట ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలుతో సమగ్ర సర్వే నిర్వహించాలని, ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, యువతి యువకులు బ్లాక్ సాల్ట్ అధికంగా ఉండే చిప్స్, పానిపూరి మొదలగు జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వలన ఫ్లోరైడ్ బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయని వీటిపై అవగాహన కల్పించడం,ఫ్లోరైడ్ నివారణ మన అందరి బాధ్యతని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ్ నగర్ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, యూపీహెచ్సీ సిబ్బంది,ల్యాబ్ టెక్నీషియన్లు సిహెచ్. కనకలక్ష్మీ, మౌనిక, బొద్దాం, పొగిరి, బూరాడ, వంగర,రేగడి ఆముదాలవలస,సంతకవిటి, మండవకురిటి, పెరుమాలి, వాడాడ, తెర్లాం మొదలగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిహెచ్ఓ&ఎంపిహెచ్ఈఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు