Friday, January 16, 2026
Homeతెలంగాణబస్‌పాస్‌ చార్జీలు పెంపు… తక్షణమే అమలు

బస్‌పాస్‌ చార్జీలు పెంపు… తక్షణమే అమలు

- Advertisement -

విశాలాంధ్ర- హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్‌ చార్జీలు పెరిగాయి. సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల బస్‌ పాస్‌ ఛార్జీలను టీజీఎస్‌ ఆర్టీసీ పెంచింది. పెంచిన బస్‌ పాస్‌ ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. 20 శాతానికి పైగా బస్‌ పాస్‌ రేట్లు పెరిగాయి. రూ. 1150 ఉన్న ఆర్డినరీ పాస్‌ ధర రూ. 1400, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ రూ.1800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో ఏసీ పాస్‌ ధరలనూ పెంచారు. సాధారణ ఛార్జీలతో పాటు బస్‌ పాస్‌ ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై పురుష ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, మగవారిపై ఛార్జీల బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌కు నూకలు చెల్లినట్లే అని ప్రయాణికులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు