Friday, January 16, 2026
Homeవ్యాపారంభారత్‌లో ఘనంగా ఎంజీ మోటార్‌ 6వ వార్షికోత్సవం

భారత్‌లో ఘనంగా ఎంజీ మోటార్‌ 6వ వార్షికోత్సవం

- Advertisement -

న్యూదిల్లీః జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్‌ భారతదేశంలో తన ఆరవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, కంపెనీ పరిమిత కాలానికి ప్రత్యేక వార్షికోత్సవ ధరలు, హెక్టర్‌, ఆస్టర్‌ మోడళ్లపై 100% ఆన్‌-రోడ్‌ ఫండిరగ్‌, ఈఎంఐ హాలిడే ఎంపికలను ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్‌ ఎస్‌యూవీ అయిన ఎంజీ హెక్టర్‌ పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లు ఇప్పుడు ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. హెక్టర్‌ షార్ప్‌ ప్రో ఎంటి వేరియంట్‌ను రూ.19.59 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌, పాన్‌-ఇండియా) ప్రభావవంతమైన ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వార్షికోత్సవ వేడుకల భాగంగా, ఎంజీ మోటార్‌ తన బ్లాక్‌బస్టర్‌ ఎస్‌యూవీ అయిన ఆస్టర్‌ వేరియంట్లపై ప్రత్యేక పరిమిత కాలపు ఆఫర్‌ను ప్రకటించింది. ఎంజీ ఆస్టర్‌ను ఇప్పుడు రూ.9.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌, పాన్‌-ఇండియా) ప్రారంభ ధర వద్ద పొందవచ్చు. ఈ వార్షికోత్సవం, హెక్టర్‌, ఆస్టర్‌ మోడళ్లకు ఎస్‌యూవీ ఔత్సాహికులలో ఉన్న ప్రాచుర్యానికి నిదర్శనమని, వీటి ప్రత్యేకమైన స్టైలింగ్‌, ప్రీమియం ఇంటీరియర్లు, టెక్నాలజీ-ఫస్ట్‌ దృష్టికోణం, ఆకర్షణీయమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వినయ్‌ రైనా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు