Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనంతపురంరోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

హెల్మెట్ ధరించండి – మీ ప్రాణాలను కాపాడుకోండి
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

విశాలాంధ్ర – ధర్మవరం : హెల్మెట్ ధరిస్తూ మీ ప్రాణాలను కాపాడుకోవాలని, మీ తలకి రక్షణ అంటే మీ కుటుంబానికి భద్రత అని, మీ జీవితం విలువైనదని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధర్మవరం పట్టణంలో హెల్మెట్ వాడకం పై జిల్లా పోలీస్ శాఖ జిల్లా రవాణా అధికారులతో కలిసి పట్టణంలో నాలుగు కిలోమీటర్ల మేర బైకు ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ అధికారులు, సిబ్బంది ,రవాణా శాఖ అధికారులతో కలిసి హెల్మెట్ ధరించి బైకు ర్యాలీ చేపట్టారు.ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలతో సమావేశమైన జిల్లా ఎస్పీ రవాణా శాఖ అధికారి కరుణ సాగర్ రెడ్డి, డీఎస్పీ హేమంత్ కుమార్ తో కలిసి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ,2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 555 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, అందులో 190 ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని తెలిపారు.
ఈ 190 ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 120, మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు.హెల్మెట్ లేకపోవడమే అనేక ప్రాణ నష్టాలకు కారణం అని
చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో హెల్మెట్‌ను తప్పనిసరి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని వారు స్పష్టం చేశారు.
వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని,మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.వేగం కంటే క్షేమమే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించాలని,
జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారూ.ఈ ర్యాలీ కార్యక్రమంలో, జిల్లా రవాణా అధికారి కరుణ సాగర్ రెడ్డి, డీఎస్పీ హేమంత్ కుమార్, ఆర్టీవో రాణి ,సి ఐ లు రెడ్డప్ప, సునీత, శ్రీధర్, శివరాముడు ,ధర్మవరం సబ్ డివిజన్లోని ఎస్ఐలు, రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు