రెండు వారాల్లో 900 సార్లు భూ ప్రకంపనలు
టోక్యో: జపాన్ వరుస భూకంపాలతో వణికిపోతోంది. రెండు వారాల్లో దాదాపు 900 సార్లు భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ వాతావరణశాఖ ఏజెన్సీ అధికారి అయాటకా ఎబిటా వెల్లడిరచింది. తాజాగా 5.5 తీవ్రతతో భూకంపం రాగా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి కానీ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టొకార దీవుల్లో జూన్ 21 నుంచి భూఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్లు వెల్లడిరచారు. జపాన్‌లోని మిగతా ప్రాంతాల కంటే టొకార దీవుల్లో జనాభా తక్కువగా ఉండటంతో భూకంపం వల్ల నష్టం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. జూన్ 23న ఒక రోజే 183 సార్లు భూమి కంపించింది. గతేడాది ఇదే దీవుల్లో 346 సార్లు ప్రకంపనలు వచ్చాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లోని ప్రధాన భూ ఫలకాలపై జపాన్ ఉండటంతో ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు ఈ దేశంలో సంభవిస్తాయి. ఏడాదికి సుమారు 1,500 భూ ప్రకంపనలు నమోదవుతాయి. అందుకోసమే అక్కడి ప్రభుత్వం ఎంతటి భూకంపాన్నైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంటుంది.